Some call me as atheist,
Some call me broken Heart,
Some call as extremist,
Some call as intellectual,
Some call as socialist,
Some call as writer,
Some call as pseudo analyst,
Some call as sidelined,
Some call as stupid,
Some call as hypocrite,
Some call as loser
but still I don't know, who am I?
They think I am alone without her.....
Loneliness is with me I just want to say.....
Oh! God I just want to come to u with all my smiles.....
నా హృదయాన్ని ఒత్తిగా చేసి వెలిగించాను దీపాన్ని నీ జీవితం ఆనందంగా వెలుగొందాలని... నా పాదాలతో నలిపివేసాను ముళ్ళన్నీ నీవు నడిచే దారి పూబాట కావాలని...
నా కళ్ళు చెమ్మగిల్లలేదు ఎందుకని తను అనుకున్నది నేను రోధించలేదని... అడిగింది స్వప్నాలలోనైనా తనని తలుస్తానా అని తనకేం తెలుసు నేను నిదురించి ఒక యుగమైనదని...
నీవు వస్తే వెళతానని అనకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళకు. నీపై నాకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు! నా పై ప్రేమ వుంటేనే రా!! నన్ను చూడాలి అనిపిస్తేనే రా!! ప్రపంచంలోని ప్రేమనంతా నీకై వుంచా రా!!
కన్నీటితో నుదుటి రాతలను చెరిపివేయలేమని తెలిసి ఎప్పుడు కంటనీరు రానీయకూడదనుకున్నాను... ధుఃఖాన్ని కనబడనీయకుండా నవ్వు అనే ముసుగు వేసుకున్నాను... తాను కరిగి వేరొకరికి వెలుగునిచ్చే కొవ్వొత్తిలా కరిగిపోవాలనుకుంటున్నాను...
పగలు గడిచింది అనుకుంటే రాత్రి అయింది. నిన్ను మరవాలి అనుకున్న ప్రతిసారి భాధ అధికమైంది. మౌనంగా ఉండి చూసాను..... నా ప్రతి శ్వాస నీ ఉనికినే తెలిపింది అప్పుడు తెలిసింది.... నా శ్వాస ఆగిపోతే నా మనసు నిన్ను మరచిపోతానంది.
ప్రియా! చేసిన బాసలని ఎలా మరచిపోయావు. స్వప్నాలని జ్యోతులుగా మన ఇంట వెలిగిస్తానన్నావు. నీ ప్రేమని నా పూలబాటగా పరుస్తానన్నావు. నా అడుగులో అడుగై నడుస్తానన్నావు. నీకై వేచి వున్నాను ప్రియా!!!!!
ఎన్నెన్నో ఆశలతో జీవిస్తున్నాను నీ ఆలోచనలతో బ్రతికేస్తున్నాను నిన్ను నేను స్వప్నాలలో చూసుకుంటున్నాను కనురెప్పలు మూసితెరచిన ప్రతిసారి నిన్ను తలుస్తున్నాను...
కన్నులు నీవి....కన్నీళ్ళు నావి హృదయం నీది.....హృదయలయ నాది జీవితం నీది.....శ్వాస నాది ప్రతి గెలుపు నీది.....ఓటమి నాది మృత్యువు పై కప్పే వస్త్రం నీది....మృత్యువు నాది ప్రియతమా!! ఇక్కడ మాత్రం అంతిమ విజయం నాది.
మనసారా పిలిచే ప్రతి పలుకులో నీవుండిపోవా మరచిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోవా ఎదనిండా కొలిచే ప్రేమకి ప్రతిరూపానివి నీవుకావా ప్రియతమా! నా గుండె లయగా మారిపోవా.....
అనుబంధాలు అద్దం లాంటివి మన మనసుకి ప్రతిబింబాలవి.. విరిగితే గుచ్చుకుంటాయి అతికినా గుర్తులు మిగులుంటాయి.. పగలడానికి క్షణం.అతుక్కోడానికి యుగం పడుతుంటాయి....
మదిలోని మంచితనానికి మరణం లేదు. ఎదురుచూసే హ్రుదయానికి ఓటమి లేదు. అనుక్షణం నీవే నేనుగా తపించే స్నేహానికి అవధులే లేవు.
నీ ప్రేమను పొందలేనేమో కాని ప్రేమతో నిన్ను పూజించగలను. నీతో కలసి జీవించలేనేమో కాని నిన్ను ఆరాధించగలను. నీ చెంత లేకపోఅయినా నీ ఆనందాన్ని కోరుకుంటాను. నీ స్నేహమే నాకు ఒక వరమనుకుంటాను.........