ప్రియా! చేసిన బాసలని ఎలా మరచిపోయావు.
స్వప్నాలని జ్యోతులుగా మన ఇంట వెలిగిస్తానన్నావు.
నీ ప్రేమని నా పూలబాటగా పరుస్తానన్నావు.
నా అడుగులో అడుగై నడుస్తానన్నావు.
నీకై వేచి వున్నాను ప్రియా!!!!!
About Me
- Yohanth
- Some call me as atheist, Some call me broken Heart, Some call as extremist, Some call as intellectual, Some call as socialist, Some call as writer, Some call as pseudo analyst, Some call as sidelined, Some call as stupid, Some call as hypocrite, Some call as loser but still I don't know, who am I? They think I am alone without her..... Loneliness is with me I just want to say..... Oh! God I just want to come to u with all my smiles.....
Friday, May 29, 2009
Wednesday, May 27, 2009
ముసుగు
మంచితనానికి రోజులే లేవనిపిస్తుంది.
నమ్మకమనే మాటకి అర్థమే మారింది.
ఎదలోని భాధ ఎక్కడ కన్నీరై ప్రవహిస్తుందోనని
పెదవులపై నవ్వుని పులుముకుని జీవిస్తుంది...
నమ్మకమనే మాటకి అర్థమే మారింది.
ఎదలోని భాధ ఎక్కడ కన్నీరై ప్రవహిస్తుందోనని
పెదవులపై నవ్వుని పులుముకుని జీవిస్తుంది...
Saturday, May 23, 2009
తలపు
ఎన్నెన్నో ఆశలతో జీవిస్తున్నాను
నీ ఆలోచనలతో బ్రతికేస్తున్నాను
నిన్ను నేను స్వప్నాలలో చూసుకుంటున్నాను
కనురెప్పలు మూసితెరచిన ప్రతిసారి నిన్ను తలుస్తున్నాను...
నీ ఆలోచనలతో బ్రతికేస్తున్నాను
నిన్ను నేను స్వప్నాలలో చూసుకుంటున్నాను
కనురెప్పలు మూసితెరచిన ప్రతిసారి నిన్ను తలుస్తున్నాను...
Friday, May 15, 2009
గెలుపెవరిది?
కన్నులు నీవి....కన్నీళ్ళు నావి
హృదయం నీది.....హృదయలయ నాది
జీవితం నీది.....శ్వాస నాది
ప్రతి గెలుపు నీది.....ఓటమి నాది
మృత్యువు పై కప్పే వస్త్రం నీది....మృత్యువు నాది
ప్రియతమా!! ఇక్కడ మాత్రం అంతిమ విజయం నాది.
హృదయం నీది.....హృదయలయ నాది
జీవితం నీది.....శ్వాస నాది
ప్రతి గెలుపు నీది.....ఓటమి నాది
మృత్యువు పై కప్పే వస్త్రం నీది....మృత్యువు నాది
ప్రియతమా!! ఇక్కడ మాత్రం అంతిమ విజయం నాది.
Thursday, May 14, 2009
నా గుండె లయగా...
మనసారా పిలిచే ప్రతి పలుకులో నీవుండిపోవా
మరచిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోవా
ఎదనిండా కొలిచే ప్రేమకి ప్రతిరూపానివి నీవుకావా
ప్రియతమా! నా గుండె లయగా మారిపోవా.....
మరచిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోవా
ఎదనిండా కొలిచే ప్రేమకి ప్రతిరూపానివి నీవుకావా
ప్రియతమా! నా గుండె లయగా మారిపోవా.....
Tuesday, May 12, 2009
Saturday, May 2, 2009
నేస్తం!
కోయిల గానం మరచిన
కవిత కలం మరచిన
కంఠం మూగపోయిన
కనులు నిన్ను చూడక పోయిన
నేను నిన్ను మరువను... నేస్తం!
కవిత కలం మరచిన
కంఠం మూగపోయిన
కనులు నిన్ను చూడక పోయిన
నేను నిన్ను మరువను... నేస్తం!
Subscribe to:
Posts (Atom)