నన్నునేను మరచినా నిన్ను మరువను
కలలమాటున నిన్ను దాచుకుంటాను...
నీ ఊహనే శ్వాసగా మార్చుకున్నాను
జ్ఞాపకాలనీడగా నిన్ను తలచుకుంటాను...
భావాలఝరిగా నిన్ను మలచుకున్నాను
రాసే ప్రతి పదములో నీ రూపుగాంచెదను...
నీవు నా దానివి కాదన్నది నిజమైనను
మరుజన్మను మాత్రం నేనెలా నమ్ముతాను...
నీ చెలిమిలేని జీవితం నేనూహించలేను
ఈ జన్మలోనే నే నిన్నుచేరి అంతమయ్యేను...
కలలమాటున నిన్ను దాచుకుంటాను...
నీ ఊహనే శ్వాసగా మార్చుకున్నాను
జ్ఞాపకాలనీడగా నిన్ను తలచుకుంటాను...
భావాలఝరిగా నిన్ను మలచుకున్నాను
రాసే ప్రతి పదములో నీ రూపుగాంచెదను...
నీవు నా దానివి కాదన్నది నిజమైనను
మరుజన్మను మాత్రం నేనెలా నమ్ముతాను...
నీ చెలిమిలేని జీవితం నేనూహించలేను
ఈ జన్మలోనే నే నిన్నుచేరి అంతమయ్యేను...
Yohanth Congrats......మీ బ్లాగ్ న్యూలుక్ తో మెరిసిపోతుంది. ఇలాగే కంటిన్యూ చేయండి. తెలుగు మీ మాతృభాష కాకపోయినా మంచి పట్టుంది, కొనసాగిస్తారని ఆశిస్తూ. అభినందనలతో పద్మార్పిత!
ReplyDeleteపద్మార్పిత....మీరే నాకు ఇన్స్పిరేషన్ & గైడ్, నా ప్రతి పదంలో మీరున్నారని చెప్పడానికి నేను సంకోచించను. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. తప్పక రాసి మీ మెప్పులు పొందాలని కాంక్షిస్తున్నాను.Thanks for greeting me too.
ReplyDeleteYohanth good going, keep it up.
ReplyDeleteమంచి భావాలున్నాయి మీలో రాస్తూ ఉండండి
ReplyDelete