నన్నునేను మరచినా నిన్ను మరువను
కలలమాటున నిన్ను దాచుకుంటాను...
నీ ఊహనే శ్వాసగా మార్చుకున్నాను
జ్ఞాపకాలనీడగా నిన్ను తలచుకుంటాను...
భావాలఝరిగా నిన్ను మలచుకున్నాను
రాసే ప్రతి పదములో నీ రూపుగాంచెదను...
నీవు నా దానివి కాదన్నది నిజమైనను
మరుజన్మను మాత్రం నేనెలా నమ్ముతాను...
నీ చెలిమిలేని జీవితం నేనూహించలేను
ఈ జన్మలోనే నే నిన్నుచేరి అంతమయ్యేను...
కలలమాటున నిన్ను దాచుకుంటాను...
నీ ఊహనే శ్వాసగా మార్చుకున్నాను
జ్ఞాపకాలనీడగా నిన్ను తలచుకుంటాను...
భావాలఝరిగా నిన్ను మలచుకున్నాను
రాసే ప్రతి పదములో నీ రూపుగాంచెదను...
నీవు నా దానివి కాదన్నది నిజమైనను
మరుజన్మను మాత్రం నేనెలా నమ్ముతాను...
నీ చెలిమిలేని జీవితం నేనూహించలేను
ఈ జన్మలోనే నే నిన్నుచేరి అంతమయ్యేను...