About Me

My photo
Some call me as atheist, Some call me broken Heart, Some call as extremist, Some call as intellectual, Some call as socialist, Some call as writer, Some call as pseudo analyst, Some call as sidelined, Some call as stupid, Some call as hypocrite, Some call as loser but still I don't know, who am I? They think I am alone without her..... Loneliness is with me I just want to say..... Oh! God I just want to come to u with all my smiles.....

Tuesday, August 28, 2012

ఈ జన్మలో

నన్నునేను మరచినా నిన్ను మరువను
కలలమాటున నిన్ను దాచుకుంటాను...
నీ ఊహనే శ్వాసగా మార్చుకున్నాను
జ్ఞాపకాలనీడగా నిన్ను తలచుకుంటాను...
భావాలఝరిగా నిన్ను మలచుకున్నాను
రాసే ప్రతి పదములో నీ రూపుగాంచెదను...
నీవు నా దానివి కాదన్నది నిజమైనను
మరుజన్మను మాత్రం నేనెలా నమ్ముతాను...
నీ చెలిమిలేని జీవితం నేనూహించలేను
ఈ జన్మలోనే నే నిన్నుచేరి అంతమయ్యేను...

Sunday, July 29, 2012

దూరమైనావు

మరచిపోమంటావు మరపులోదాగి నీవు
నిదురపోనీయవు కలవరింతగామారి నీవు
ఆకలిని హరించి ఆరగించమంటావు నీవు
నా నవ్వుని దొంగిలించి నాకు దూరమై నీవు
మనసుదోచి నన్ను నర్తించు అన్నావు నీవు
నన్ను నాకు దూరం చేసినావు...ప్రియతమా!

Wednesday, June 13, 2012

తలవకు

మనసా మరి మరి తలవకు
తలచి మరింతగా విలపించకు
విలపించిన నీ కంటరాలు
ఎగసిపడిన జ్ఞాపకాలు....

నిను తలవక ఉండలేను
నాకునేనే దూరంకాలేను
ఆగదు ఆగమన్నా ప్రాయం
వీడిపోదు పొమ్మన్నా ప్రాణం....

Tuesday, February 22, 2011

మత్తు

త్రాగే మందులో లేదు
ఉంటే సీసా వేసేది చిందు..
నిగ్రహంగా వుంటే ఏమీ చేయదు
మందే కాదు స్త్రీ పొందు..

Friday, July 30, 2010

నువ్వు కాదని అంటే

పూలపై పడిన మంచుబిందువులతో పూలరేకులు వాడిపోవు...

దూరమైనా మన మనసుల్లో ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు...

క్షణం ప్రతిక్షణం ఆగిపోదు మనం ఆగిపొమ్మని అంటే...

క్షణం ఆ మరుక్షణం ఆగిపోతుంది నువ్వు కాదని అంటే...




Monday, May 24, 2010

భిన్నంగా

అందరు అందాన్ని చూస్తే
నేను హృదయాన్ని చుసాను.
అందరు స్వప్నాలను చూస్తే
నేను వాస్తవాలని వెతికాను.
అందరూ రహదారిన అడుగేస్తే
నేను గమ్యాన్ని చేరాను...

Saturday, December 26, 2009

ఏం తెలుసు?

అగ్గిని రాచేసినవానికేం తెలుసు దాన్ని ఆర్పడం
మనసువిరిచేవానికేం తెలుసు మనసివ్వడం
మాట మార్చేవానికేం తెలుసు మాటివ్వడం
అడ్డదారిన వెళ్ళేవానికేం తెలుసు దారిచూపడం
తనకితానే అర్థంకానివానికేం తెలుసు ఎదుటివారినర్థం చేసుకోవడం