About Me

My photo
Some call me as atheist, Some call me broken Heart, Some call as extremist, Some call as intellectual, Some call as socialist, Some call as writer, Some call as pseudo analyst, Some call as sidelined, Some call as stupid, Some call as hypocrite, Some call as loser but still I don't know, who am I? They think I am alone without her..... Loneliness is with me I just want to say..... Oh! God I just want to come to u with all my smiles.....

Saturday, September 5, 2015

అంకితం

నీ ప్రేమని పొందక ముందే నిన్ను కోల్పోయాను

ఎందుకే మనసా నీవు కొట్టుకుని ఆగుతున్నావు

చూడు...అప్పుడు స్పందించి ఇప్పుడు విలపించేవు


తెలియలేదు ఎందుకే నీకు కన్నీట స్నానమాడేవని


అలోచించకనే అనుకున్నవి అక్షరాలుగా మారుస్తాను


నా అక్షరాల్లో నిన్ను నీవు రోజూ వెతుకుతావని తెలిసి


ఆరాటాన్ని అంతా అక్షరాల్లో అందంగా ఇమడనిస్తాను


నీ అందాల్ని చిత్రాల్లో చూసి ఆస్వాధిస్తున్నారని తెలిసి.


పద్మార్పితగారికి అంకితం

Friday, April 17, 2015

శ్వాస


శ్వాస తీసుకున్న ప్రతీసారి
నీవు గుర్తొస్తావు..
తీసుకోకపోతే ఊపిరాగిపోయి
ప్రాణమే ఉండదు..
ఏం చెప్పను నేను
శ్వాసిస్తేనే జీవించగలనని..
నీకు తెలుసా ?
నినుతలచే శ్వాస నన్నుతాకెనని!

Friday, January 2, 2015

మనసు

కఠినహృదయానికి ఏం తెలుసు
కరిగినకలలు కార్చే కన్నీరెందుకో.

 రాతిలాంటి గుండెకు ఏం ఎరుక
రగులుతున్న మదిమంట ఏమిటో.

చచ్చుబడిన మనసుకు తెలియదు
నాసిరకం నరాల సలపరం ఎటువంటిదో.

Monday, December 15, 2014

చిన్ని జీవితం


లోకమంత స్వార్థమే
అందుకే వదిలేసాను
కలిసిమెలిసి జీవించడం...
లేకపోతే నా ఈ చిన్నిజీవితానికి
ఒంటరితనం అవసరమా చెప్పండి!!

Thursday, October 16, 2014

వెళ్ళలేక

నాకు జీవితానుభవం అంతగా లేదు....కానీ

నిడారంబరంగా జనం బ్రకనివ్వరని విన్నా!

డాబు, దర్పం, దర్జాలకి పీటవేసి కూర్చోమన్నా

క్రింద కూర్చోవడం అలవాటులేక నిలుచున్నా...

కాళ్ళునొప్పి పుట్టి నిలబడలేక వెళదామనుకున్నా

సంఘజీవివి కదా సంస్కారంతో మెలగాలనుకున్నా!

Tuesday, September 9, 2014

నావారు

సుడిగుండాలుండవు కొలనులో అని
ప్రకృతివైపు ప్రశాంతంగా తిలకించబోతే...
మనసు కాదంటూ కళ్ళెం వేసింది...
జ్ఞాపకాల లావాలనే గుర్తుచేసింది!
కన్నీళ్ళతో తనువునే తడిపి ముద్దచేసి
ప్రకంపనలు రేపి విధికి తలవంచమంది!
వళ్ళు వణికి కన్నీటి సాగరమైతే...
జీవితం ఎంత అమూల్యమైందో తెలిసింది!
నా అనుకున్నవాళ్ళంతా ముసుగేసుకుంటే
తెలియని బంధమేదో కన్నీరు పెట్టింది!

Saturday, May 24, 2014

దూరమై

ఒకరికొకరం దూరమై ఎద భారమై
పగలు శూన్యంగా రేయి దిగులుగా
చంద్రుడు కానరాక తారలు మెరవక
వసంతంలో కోయిల గొంతు మూగదై
ప్రణయద్వారమే మూసుకు పోయింది
జ్ఞాపకాలనీడలు దారి చూపలేనన్నాయి
నీ పరిచయంలో మనసు పులకరించేదని
నిన్ను వీడినాకే నా ఊపిరికి అది తెలిసింది
తోటమాలే పూలని కాలితో నలిపేస్తున్నాడని

Wednesday, January 29, 2014

కర్మఫలం

జీవితం జీవించడం నేర్పుతుంది
నవ్వించి ఏడిపిస్తుంది జీవితం...
నచ్చినట్లుగా జీవించు నీ జీవితం
వెంటరమ్మన్నా రాననేదే జీవితం
కాలంతో కరుగుతుంది జీవితం...
అసంపూర్తిగా అంతమైపోతుంది
జీవించడమనేది అందమైన వరం
చావన్నది నిర్ణయించేది కాలం...
అంతమయి ఇతరుల మనసులో
జీవించడమనేది మన కర్మఫలం...

Saturday, October 26, 2013

వచ్చేయరాదా!!

విత్తునాటాము ఇద్దరంకలిపి
ఆ మొక్క వృక్షమై పెరిగింది
ఇకనైనా వచ్చేయరాదా!!
చిగురులు ఆకులై నీడ విస్తరించె
పూలు ఫలధీకరించి పిందెతొడిగె
ఇకనైనా వచ్చేయరాదా!!
పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి
వలసపక్షులు వెళ్ళిపోతున్నాయి
ఇకనైనా వచ్చేయరాదా!!
ఒంటరి ఎదురుచూపులు ఎంతకాలం
వేచిన మదిని కానీయకు విచ్ఛిన్నం
ఇకనైనా వచ్చేయరాదా!!
ఈ చెట్టునీడనే ప్రేమ సమాధి చేయకు
గోరీకట్టి నమ్మకాన్ని వమ్ముకానీయకు
ఇకనైనా వచ్చేయరాదా!!
 

Sunday, October 6, 2013

ఆమె

వేసవిలో వర్షమై కురవనా
వెన్నెలను పాన్పులా పరవనా
ఆమె కొంటె చూపవనా
ఆమె మేను మెరుపునవనా
ఆమె వేధనకు మందవనా
ఆమె కోరితే ప్రాణమే ఇవ్వనా?

Sunday, July 21, 2013

ఎలాచెప్పను?

నా పరిచయం నిన్ను విసిగించి
నా నుండి విడిపోయే ముందు
ఒకే ఒక్కసారి నాలా ఆలోచించు
నీపై కోపం వస్తే గట్టిగా అరుస్తాను
నీవెళ్ళిపోతే ఒంటరిగా ఏడుస్తాను
చూడాలని నాలోనే నిన్ను వెతికి
కనబడక పిచ్చివాడినై పోతాను
నీవు నా అన్న ధీమాతో చేస్తాను
ఇది ప్రేమకాదంటే ఏం చేయను?
నీవులేనిదే నేలేనని ఎలాచెప్పను?

Tuesday, March 26, 2013

ప్రేమంటే

ప్రేమంటే ఏమిటో నేనెరుగను
ఈ జీవితం నాకోసమేమనుకోను
ఊపిరాడనీయని వ్యధలలో నన్ను
ప్రేమించే వారున్నారని ఎలా నమ్మను!

ప్రేమించే ప్రయత్నమేదో చేసేయి
ద్వారాలు వాటికవే తెరుచుకుంటాయి
కలవాలన్న కోరికని నీలో కలగనీయి
వంకలెన్నో తివాచిపరచి సాగమంటాయి!

Sunday, February 24, 2013

మంటను మరల రాచేయకు

ఆలోచనలే ప్రాణాంతకమై సుడులు తిరుగుతున్నవేళ
సుధీర్ఘకాలం జీవించమనే  ప్రార్ధన ఫలించింది అలా

జీవితం ప్రస్తుతం ఏం జీవిస్తునామని, ఏదో వెళ్ళబుచ్చుతున్నా
గడిపోతున్న ఈ జీవితాన్ని సాగదీయడమెందుకో చిరకాలమని!

కలల నీలాకాశాన్ని ఊహల తారలతో అలంకరించకు
అవసరానికి అక్కరకురాక కంటపడితే కరచాలమీయకు
కల్మషాన్ని దాచిన నగుమోములో అనురాగాన్వేషణ చేయకు
నివురుగప్పిన నిప్పులోని మంటను మరల రాచేయకు!

Saturday, December 15, 2012

ఏకమై

సుఖఃదుఖాలు జీవన సాగర కెరటాలు
ఆటుపోట్లకి అల్లాడితే సాగదు పయనం
కనులు కనులతో కలిపి చేయూతమీయి
నా మనసుని ప్రేమించే ప్రయత్నంచేయి
సుఖఃదుఖాలను నీతోనే పంచుకుంటాను
ప్రేమసాక్షిగా నీ తోడునీడనై నేనుంటాను
నీవువేరని నేనువేరని కాక ఏకమై జీవిద్దాం
బాధైనా ఏదైనా వీడని బంధమై పయనిద్దాం

Wednesday, November 14, 2012

జీవంపోయి

ప్రేమే ప్రేమకి పరిభాషడిగింది
సాగరమే దాహం తీర్చమంది
వేడినార్పే గాలే ఆవిరివద్దంది
పెనవేసుకున్నబంధం పొమ్మంది
కనులతో తాకి ప్రేమకి జీవంపోయి
మనసులోస్మరించి అమరత్వానీయి

Friday, November 2, 2012

ఇలావద్దు

నా పగలు గడిచింది నీ అలుకలో
రేయి గడవకుంది నీ నిరీక్షణలో
నీ చిరునవ్వే నన్ను బ్రతికిస్తుంది
భ్రాంతి నుండి బయటపడేస్తుంది
ప్రేమించే మనసని క్షణాల్లో అనకు
ప్రేమించి నమ్మించి మోసం చేయకు.
బరువెక్కిన మనసుకు ఏ మందూవద్దు
నన్ను నాకు దూరంచేసి ప్రాణంపోయొద్దు.


Tuesday, October 23, 2012

ఎలామరి?

నిదురపో అంటావు
నిదుర రానీయవు..
ఆరగించమని అంటావు
నాలో ఆకల్ని హరించావు
మనసారా నవ్వమంటావు
మనసంతా నీవే నిండావు
కలలోనైనా రాలేదంటావు
ప్రేమతో నన్ను పిలవవు..

Saturday, October 6, 2012

అదే జరిగింది

వద్దనుకునదే జరిగింది
పరిచయమనుకున్నదే
ప్రేమగా మారింది.
మనసుపడ్డాను ప్రేమించి
మనసుదోచాను నాదనుకుని
నిన్ను చూడనిదే కుదుటపడనంది
మనసు ఎవరెన్ని చెప్పిన వినకుంది
మేల్కొని నిదురించి నీకై చూచి
వేరే ధ్యాసే మదిని చేరకుంది.
నీవులేక గడవని పగటిని చూసి
రేయి కూడా మొండికేసింది.
నీవు దరిలేని లోకం నాకు నచ్చకుంది.

Wednesday, September 26, 2012

ఎందుకో

రాతిని రంజింపజేసే రాతిగంధమెందుకో
అలవోకగా తాకే అందని అందాలెందుకో
పక్వతలేని మనసుల ప్రేమపాసమెందుకో
పరువాల పొందులకై పడిగాపులెందుకో?

Sunday, September 16, 2012

ఏలనో?

మూగవైన మనసు ఊసులు
గుడ్డిదైన ప్రేమకి ఎలా తెలిసునో?
మనసు మెచ్చిన పనులు
ఎవరు వలదన్నా చేస్తాం ఏలనో?